చాకొలేట్‌ కేక్‌
  • 416 Views

చాకొలేట్‌ కేక్‌

కావలసినవి:

  • మైదాపిండి: 250 గ్రా.
  • బేకింగ్‌ పౌడర్‌: 2 టీ స్పూన్లు
  • సాల్ట్‌: 1 చిటికెడు
  • కొకోవా పౌడర్‌: 3-4 టేబుల్‌ స్పూన్లు
  • వెన్న: 250 గ్రా.
  • పొడిచేసిన చక్కెర: 250 గ్రా.
  • గుడ్లు: 4
  • మజ్జిగ: 1 కప్పు
  • వెనిల్లా ఎస్సెన్స్‌: 1 టీ స్పూన్‌

విధానం:

ఒవెన్‌ను ముందుగా 180 డిగ్రీ సెంటీగ్రేడ్‌ వరకూ వేడి చేయండి. ఒక టిన్‌ తీసుకొని దాని చుట్టూ నెయ్యి పోయండి. మైదాలో బేకింగ్‌ పౌడర్‌, సాల్టు, కొకోవా పౌడర్‌ వేసి బాగా కలపండి. వెన్నలో ఎలాంటి గడ్డలూ లేకుండా చేసుకొని అందులో పొడి చేసిన చక్కెర కలిపి ఎగ్‌బీటర్‌తో కలిసేలా కొట్టాలి. నురగ వచ్చే దాకా దీనిని బీట్‌ చేయాలి. తర్వాత ఒక్కొక్క గుడ్డూ పగులకొట్టి ఇందులో కలపాలి. తర్వాత కొకోవా కలుపుకున్న మైదా పిండిని రెండు మూడు స్పూన్ల చొప్పున అందులో వేస్తూ కొద్దిగా మజ్జిగ కూడా పోస్తూ మెత్తగా అయ్యేలా చూసుకోవాలి. చివరగా వెనెల్లా ఎస్సెన్స్‌ కలుపుకొని కేక్‌ టిన్‌లో పోసి ఒవెన్‌లో 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో అరగంట, నలభై నిమిషాల పాటు ఉంచి తీసెయ్యాలి.