చాకొలేట్ కేక్
 • 414 Views

చాకొలేట్ కేక్

కావలసినవి:

 • మైదా - ఒకటి ముప్పావు కప్పు,
 • కోకో పౌడర్ - పావు కప్పు,
 • ఉప్పు - చిటికెడు,
 • తాజా గడ్డపెరుగు - ఒక కప్పు,
 • పంచదారపొడి - ఒక కప్పు,
 • బేకింగ్ పౌడర్ - అర టీ స్పూను,
 • వంటసోడా - టీ స్పూను,
 • రిఫైండ్ నూనె లేదా వెన్న - అరకప్పు,
 • వెనిలా ఎసెన్స్ - టీ స్పూను,
 • జీడిపప్పు, ఆక్రోట్లు, బాదం - అరకప్పు,
 • పాలు - అరకప్పు

విధానం:

మైదా, కోకోపౌడర్, ఉప్పు కలిపి జల్లించాలి. పెరుగులో పంచదారపొడి కలిపి బాగా గిలకొట్టాలి. ఇందులో వంటసోడా, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. తరవాత కరిగించిన వెన్న లేదా నూనె, వెనిలా ఎసెన్స్ కలిపి మరికొద్ది సేపు గిలకొట్టాలి. జల్లించిన మైదా, సన్నగా కట్‌చేసుకున్న డ్రైఫ్రూట్స్ కూడా వేసి కలపాలి. పిండి జారుడుగా ఉండడానికి అవసరమైతే కొద్దిగా పాలు కలపాలి. కేక్ టిన్ను లోపల భాగమంతా వెన్న రాసి, కొద్దిగా మైదా వేసి మొత్తం గిన్నెకంతా అంటుకునేట్టు పరిచిన తరవాత క లిపి ఉంచుకున్న కేక్ మిశ్రమాన్ని వేసి ముందే వేడి చేసుకున్న ఓవెన్‌లో 180 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర 45 నుంచి 50 నిముషాలు బేక్ చేయాలి.

ఓవెన్ లేకున్నా కేక్ చేసుకోవచ్చు...
కేక్ చేయాలంటే కరెంట్ ఓవెన్ కాని మైక్రోవేవ్ ఓవెన్ కాని తప్పనిసరిగా ఉండాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉన్న ప్రెషర్ కుకర్లో లేదా మందపాటి అల్యూమినియం గిన్నెలో కూడా కే క్ తయారుచేసుకోవచ్చు. ముందుగా కుకర్‌లో చిల్లుల స్టాండ్ పెట్టి నీళ్లు పోయకుండా వేడి చేయాలి. దాని మీద కేక్ మిశ్రమం వేసిన గిన్నె పెట్టి కుకర్ మూతపెట్టి, వెయిట్ పెట్టకుండా సన్నమంట మీద ముప్పావుగంట వేడి చేయాలి. ఆ వేడికి కేక్ పూర్తిగా ఉడుకుతుంది. మధ్యలో మూత తీయొద్దు.