మైదా లేదా గోధుమపిండిలో వంటసోడా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించాలి. ఒక పాత్రలో వెన్న, పంచదార కలిపి గిలకొట్టాలి. ఇందులో పిండి, వెనిలా ఎసెన్స్, కోకో పౌడర్ వేసి కలిపాక చాకో చిప్స్ వేసి మెల్లిగా కలపాలి. చపాతీపిండిలా తయారయిన ఈ మిశ్రమంతో చిన్నచిన్న ఉండలు చేసి వాటిని కాస్త వెడల్పుగా ఒత్తి, వెన్న రాసిన వెడల్పాటి టిన్నులో వరుసగా పేర్చి ముందే వేడి చేసుకున్న ఓవెన్లో 220 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర 20 నిముషాలు బేక్ చేయాలి.
గమనిక: ఓవెన్ లేని వారు... కుకీస్‌ను తయారు చేసుకున్న తరవాత కుకర్ కింది భాగంలో వెన్న రాసి వీటిని వరసగా పేర్చి సన్నని సెగమీద 40 నిముషాలు ఉంచి దింపేయాలి. విజిల్ పెట్టకూడదు.