చాక్లెట్‌ ఐస్‌క్రీమ్‌
  • 669 Views

చాక్లెట్‌ ఐస్‌క్రీమ్‌

కావలసినవి:

  • చిక్కటి పాలు - అరలీటర్‌
  • క్రీమ్‌ - 250 గ్రాములు
  • పంచదార - 150 గ్రాములు
  • చాక్లెట్‌ బోర్నవిటా/ చాక్లెట్‌ బూస్ట్‌ - పావుకిలో
  • మిల్క్‌ పౌడర్‌ - 50 గ్రాములు

విధానం:

పాలను బాగా మరగనివ్వాలి. చిన్న గిన్నెలో కొద్దిగా పాలు తీసుకుని అందులో మిల్క్‌పౌడర్‌ ఉండలు కట్టకుండా కలపాలి. దానికే పంచదార చేర్చి ఈ మొత్తం మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో కలిపి అడుగంటకుండా తిప్పుతుండాలి. అందులోనే క్రీమ్‌ కలిపి చిక్కబడే వరకు తిప్పిన తర్వాత స్టౌమీద నుండి దించి చల్లార్చాలి. ఎంత త్వరగా చల్లారితే ఐస్‌క్రీమ్‌ అంత మృదువుగా వస్తుంది. చల్లారిన పాల మిశ్రమంలో చాక్లెట్‌ బోర్నవిటా/ చాక్లెట్‌ బూస్ట్‌ కలిపి పది నిముషాలు గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రీజర్‌లో ఏడెనిమిది గంటలు ఉంచితే చాక్లెట్‌ ఐస్‌ క్రీమ్‌ తయారవుతుంది.