చాకొలెట్ మిల్క్ షేక్
  • 115 Views

చాకొలెట్ మిల్క్ షేక్

కావలసినవి:

  • పాలు - కప్పు (కాచి చల్లార్చినవి)
  • చక్కెర - రెండు టీ స్పూన్లు
  • చాకొలెట్ ఐస్ క్రీమ్ - అర కప్పు
  • గార్నిష్ చేయడానికి - చాకొలెట్ సాస్,
  • తురిమిన చాకొలెట్

విధానం:

పాలు, చక్కెర, ఐస్ క్రీమ్‌లను మిక్సీ జార్‌లో వేసి బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి చాకొలెట్ సాస్, తురిమిన చాకొలెట్ పొడి తో గార్నిష్ చేయాలి.

ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు చాలా చల్లగా తాగాలంటారు పిల్లలు. మిల్క్‌షేక్ మరింత చల్లగా కావాలంటే అరగంట సేపు ఫ్రిజ్‌లో పెట్టి సర్వ్ చేయాలి.

మిల్క్ షేక్ తయారు చేసిన వెంటనే తాగాలి, చల్లగా ఉండాలి అనుకుంటే ఐస్ వేయవచ్చు. కానీ ఐస్ కరిగేకొద్దీ మిల్క్‌షేక్ పలచబడి రుచి తగ్గుతుంది.

గమనిక:
ఐస్‌ను జాగ్రత్తగా వాడాలి. కాచి చల్లార్చిన నీటితో ఇంట్లో తయారు చేసుకున్న ఐస్‌ను వాడడం మంచిది.