చాకొలేట్ మఫిన్స్
  • 476 Views

చాకొలేట్ మఫిన్స్

కావలసినవి:

  • చాకొలేట్ టీ టైమ్ మిక్స్ - 25 గ్రా. (బేకరీ ఐటెమ్స్ అమ్మే షాపులలో దొరుకుతుంది),
  • మైదాపిండి - పావు కేజీ,
  • పంచదారపొడి - 200 గ్రా.,
  • డాల్డా (మార్జిరిన్) - పావు కేజీ,
  • కోడిగుడ్లు - 5,
  • కోకోపౌడర్ - 25 గ్రా.,
  • బేకింగ్ సోడా - 2 గ్రా.,
  • చాకొలేట్ చిప్స్ - 25 గ్రా.

విధానం:

ఒక బౌల్‌లో ముందుగా కోడిగుడ్ల సొన, పంచదారపొడి వేసి బాగా కలపాలి. తరవాత మైదాపిండి, కోకోపౌడర్, బేకింగ్‌సోడా, చాకొలేట్ చిప్స్ జతచేసి మరోమారు బాగా కలపాలి. మౌల్డ్స్ తీసుకుని వాటి లోపల బటర్ పూసిన తరవాత ఈ మిశ్రమం పోసి అవెన్‌లో 160 డిగ్రీల నుంచి 180 డిగ్రీల వరకు టెంపరేచర్‌లో సుమారు 20 నిముషాలు బేక్ చేయాలి. బయటకు తీశాక కాజు, చెర్రీలతో డెకొరేట్ చేసి సర్వ్ చేస్తే చాలా బావుంటాయి.