చాక్లెట్ పానీ పూరీ
  • 418 Views

చాక్లెట్ పానీ పూరీ

కావలసినవి:

  • పూరీలు - 10
  • ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్ - టీ స్పూన్
  • పంచదార - 3 టీ స్పూన్లు
  • నీళ్లు - 2 కప్పులు;
  • చాకోస్ - పావు కప్పు
  • జీడిపప్పు, బాదం - 10;
  • చాక్లెట్ బార్ - 1

విధానం:

నీళ్లు మరిగించి, పంచదార, కాఫీ పొడి వేసి కలిపి దింపేయాలి. చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టాలి. జీడిపప్పు, బాదం, మిల్క్ చాక్లెట్ బార్ చిన్న ముక్కలుగా కట్ చేసి చాకోస్‌తో కలిపి పెట్టుకోవాలి. సర్వ్ చేసేముందు పూరీల మధ్యలో డొల్ల చేసి చెంచాడు చాకోస్, చాక్లెట్ మిశ్రమం పెట్టి కోల్డ్ కాఫీతో సర్వ్ చేయాలి. చాక్లెట్ ఇష్టపడేవారికి ఈ పానీపూరీ బాగా నచ్చుతుంది.