చాక్లెట్ పుడ్డింగ్
  • 95 Views

చాక్లెట్ పుడ్డింగ్

కావలసినవి:

  • పాలు -అర లీటరు
  • కోకో పౌడర్ - 50 గ్రా
  • గుడ్లు -మూడు
  • పంచదార - 100 గ్రా
  • వెన్న - 60 గ్రా
  • మైదా - 3 టేబుల్ స్పూన్స్
  • కార్న్ ఫ్లోర్ - 3టేబుల్ స్పూన్స్

విధానం:

ఒక గిన్నె లో కోకో పౌడర్ ,కార్న్ ఫ్లౌర్ ,కొన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి కలుపుతూ సాస్ తయారు చేయండి. తరువాత వేరే గిన్నె లో కోడిగుడ్ల మిశ్రమాన్ని పోసి ,అందులో పంచదార కలిపి బాగా కలియబెట్టండి.ఆ తరువాత ఆ గిన్నె లోనే పాలు కూడా పోయండి.  ఇప్పుడు అందులో పైన తయారు చేసి ఉంచిన చాక్లెట్ సాస్ ను పోసి మిశ్రమంలా చేయండి.తరువాత వెన్న పూసిన గిన్నె లో ఈ పాల మిశ్రమాన్ని పోసి గిన్నె మీద మూత పెట్టి స్టీంలో గాని,స్టీం పైన గాని పది నిమిషాల పాటు ఉడికించి తీసి,ముక్కలు గా కోస్తే చాక్లెట్ పుడ్డింగ్ తినడానికి రెడీ .