చాక్లెట్ సమోసా
  • 369 Views

చాక్లెట్ సమోసా

కావలసినవి:

  • మైదా - పావుకేజీ,
  • డాల్డా లేదా నెయ్యి - 50 గ్రా.,
  • ఉప్పు - చిటికెడు,
  • చాక్లెట్ బార్ - 6,
  • డ్రైఫ్రూట్స్ ముక్కలు - అరకప్పు, వెనిలా ఎసెన్స్ - మూడు చుక్కలు,
  • నూనె - వేయించడానికి సరిపడా

విధానం:

జల్లించిన మైదాలో ఉప్పు, కరిగించిన డాల్డా, వాము వేసి బాగా కలిపిన తరవాత నీరు పోసి చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచుకోవాలి. డ్రై ఫ్రూట్స్‌ని, చాక్లెట్స్‌ని ముక్కలుగా పొడి చేసి పక్కనుంచుకోవాలి. బాగా మెత్తగా అయిన తరవాత చిన్నచిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తుకోవాలి. చాకుతో రెండు భాగాలుగా కట్ చేయాలి. ఒక భాగం తీసుకుని అంచులు తడిచేసి కోన్‌లా మడిచి చెంచాడు చాక్లెట్ మిశ్రమాన్ని పెట్టి అంచులు విడిపోకుండా ఒత్తి సమోసా మడిచి వేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.