చాకొలేట్‌ యోగర్ట్‌
  • 477 Views

చాకొలేట్‌ యోగర్ట్‌

కావలసినవి:

  • పెరుగు: నాలుగున్నర కప్పులు
  • పంచదార : తగినంత
  • డార్క్‌ చాకొలెట్‌: 3/4 కప్పు (తురిమి)
  • తాజా మీగడ: 5 టేబుల్‌ స్పూన్లు
  • అక్రూట్లు: 15 (వేయించి, ముక్కలు చేసి)

విధానం:

పెరుగును ఒక సన్నని బట్టలో వేసి కింద ఒక బౌల్‌ ఉంచి రిఫ్రిజరేటర్‌లో పెట్టండి. అధికంగా ఉన్న నీరు పోయిన తర్వాత ఇంకా నీరు మిగిలి ఉన్నట్టు అనిపిస్తే దానిని పిండండి. తర్వాత ఆ పెరుగును వేరే బౌల్‌లో వేసి పక్కన పెట్టు కోవాలి. చాకొలేట్‌ను మైక్రోవేవ్‌లో వేసి ఒక నిమిషం పాటు కరిగించాలి. కరిగిన చాకొలెట్‌ను బాగా గిలకొట్టి కొంచెం తీసి పక్కన పెట్టుకొని మిగిలిన దానిలో మీగడ వేసి మళ్ళీ బాగా కలపాలి. పక్కన పెట్టుకున్న పెరుగులో పంచ దార వేసి బాగా కలపాలి. ఇందులో కరిగించిన చాకొ లెట్‌ పోసి ఫోర్క్‌తో కలపాలి. కాసిన ఆక్రూట్లు పక్కన పెట్టుకొని మిగిలినవన్నీ వేసి కలపాలి. సర్వ్‌ చేసే సమయంలో మిగిలిన ఆక్రూట్లు వేసి పైన మిగిలిన కరిగించిన చాకొలెట్‌ను చిలకరించాలి. చల్ల చల్లని డెజర్ట్‌ తయార్‌!