చుక్కకూర-ఆలూ బిర్యానీ
 • 610 Views

చుక్కకూర-ఆలూ బిర్యానీ

కావలసినవి:

 • బియ్యం - ఒక కిలో,
 • చుక్కకూర - రెండు కట్టలు,
 • బంగాళదుంపలు - పావుకిలో,
 • అల్లం వెలుల్లిపేస్ట్ - మూడు టీ స్పూన్లు,
 • ఉల్లిపాయ - ఒకటి (పెద్దది),
 • పచ్చిమిర్చి - 6 (సన్నగా తరిగినవి),
 • నూనె - 100 గ్రా.,
 • నెయ్యి- రెండు టీ స్పూన్లు,
 • లవంగాలు - నాలుగు,
 • దాల్చినచెక్క - చిన్న ముక్కలు రెండు,
 • ఉప్పు - తగినంత

విధానం:

ముందుగా బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. చుక్కకూరను శుభ్రంచేసి గ్రైండ్ చేయాలి. అన్నం వండడానికి ఉపయోగించే అడుగుమందంగా ఉన్న పాత్రను కాని, ప్రెషర్ పాన్‌ను కాని స్టవ్‌పై ఉంచి వేడెక్కిన తరువాత నూనె, నెయ్యి వేయాలి. అవి వేడెక్కిన తరువాత లవంగాలు, దాల్చినచెక్క వేసి వేగనివ్వాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన బంగాళదుంప ముక్కలు వేసి సన్న మంట మీద రెండు నిమిషాల సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు చుక్కకూర పేస్ట్ వేసి దోరగా వేగిన తరువాత తగినంత నీటిని పోసి ఉప్పు వేయాలి. నీళ్ళు మరిగిన తరువాత బియ్యం వేసి ఉడకనివ్వాలి. అంతే - చుక్కకూర - ఆలూ బిర్యానీ రె డీ.