ముందుగా రొయ్యలను వేయించి పక్కన పెట్టాలి. తర్వాత పాన్లో నూనె వేడిచేసి కొత్తిమీరను కూడా వేయించి విడిగా పెట్టుకోవాలి. గసగసాలు, లవంగాలు, జీలకర్రలతోపాటు అల్లం వెల్లుల్లి, కారం, ఉప్పు ముద్ద, వేయించిన కొత్తిమీరలను కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
ఇప్పుడు పాన్లో తగినంత నూనె పోసి ఉల్లిపాయ, టొమోటో ముక్కలను వేయించాలి. కాసేపటి తరువాత పైన నూరుకున్న ముద్దను కలిపి ఐదు నిమిషాలపాటు వేయించాలి. తరువాత వేయించి ఉంచుకున్న రొయ్యలను కలిపి నూనె పైకి తేలేంతదాకా ఉడికించి పైన కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే వేడి వేడి కొత్తిమీర రొయ్యలకూర సిద్ధం...!