చింతచిగురు - దొండకాయ
 • 254 Views

చింతచిగురు - దొండకాయ

కావలసినవి:

 • దొండకాయలు - 200 గ్రా
 • కొబ్బరి తురుము - 20 గ్రా
 • ఉప్పు - తగినంత,
 • పచ్చి శనగపప్పు - పది గ్రాములు,
 • మినప పప్పు - పది గ్రాములు,
 • ఆవాలు - అర టీ స్పూన్
 • కరివేపాకు - రెండు రెమ్మలు
 • చింతచిగురు - 20 గ్రా
 • మిరప్పొడి - పదిగ్రాములు
 • ఎండుమిర్చి - నాలుగు
 • వేరుశనగపప్పు - 50 గ్రా
 • నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు

విధానం:

ఒక్కొక్క దొండకాయను నిలువుగా రెండు ముక్కలుగా తరగాలి. ఈ ముక్కలను నూనెలో వేయించి పక్కన ఉంచాలి. మరొక బాణలిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వేరుశనగ పప్పులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత వేయించిన దొండకాయ ముక్కలు, ఉప్పు, చింతచిగురు, మిరప్పొడి వేసి కలపాలి. పైన కొబ్బరి తురుము వేసి దించాలి.