చింతచిగురు మాంసం
 • 304 Views

చింతచిగురు మాంసం

కావలసినవి:

 • కొబ్బరి పొడి - సగం కాయది
 • కొత్తిమీర- పది గ్రాములు
 • ధనియాల పొడి - 15 గ్రా
 • అల్లంవెల్లుల్లి పేస్టు - 20 గ్రా
 • జీలకర్ర - 10 గ్రా,
 • పుదీనా - 10గ్రా
 • ఆవాలు - టీ స్పూన్,
 • మటన్ - అరకేజీ
 • నూనె - 100 గ్రా
 • ఉల్లిపాయ ముక్కలు - 300 గ్రా
 • మిరప్పొడి - 10 గ్రా,
 • ఉప్పు - రుచికి తగినంత
 • చింత చిగురు - అర కిలో,
 • పసుపు - 10 గ్రా
 • గరం మసాలా - పది గ్రాములు

విధానం:

కుకింగ్ పాన్‌లో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, గరం మసాలా వేయాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. తర్వాత పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపి వేగనివ్వాలి. ఇందులో కొబ్బరిపొడి, మటన్ ముక్కలు, పుదీనా వేసి తగినంత నీటిని పోసి కలపాలి. తర్వాత ఉప్పు, మిరప్పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి మూత పెట్టాలి. మాంసం ఉడికిన తర్వాత చింతచిగురు, కొత్తిమీర వేసి సమంగా కలిసే వరకు కలియబెట్టి మరో ఐదు నిమిషాల పాటు మాంసం పొడిగా వచ్చే వరకు ఉడికించాలి.