చింతచిగురు, కందిపప్పు విడివిడిగా కుకర్లో ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టుకుని నూనె వేసి కాగిన తరవాత అందులో మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసి బాగా వేయించాలి. వేగిన తరవాత అందులో ఉడికించిపెట్టుకున్న పప్పు చింతచిగురు వేయాలి. చివరగా ఉప్పు, కారం వేసి కలపాలి. దింపే ముందర కొత్తిమీర వేసుకోవాలి. ఈ పప్పులో మజ్జిగ మిరపకాయలు నంచుకు తింటే బాగుంటుంది.