చింతచిగురు - రొయ్యలు
 • 472 Views

చింతచిగురు - రొయ్యలు

కావలసినవి:

 • టైగర్ రొయ్యలు - 250గ్రా
 • చింతచిగురు - అర కప్పు
 • ఉల్లిపాయముక్కలు - 200 గ్రా
 • టొమాటో ముక్కలు - 150 గ్రా
 • అల్లంవెల్లుల్లి పేస్టు - 50 గ్రా
 • ఉప్పు - తగినంత,
 • పసుపు - అర టీ స్పూన్,
 • ధనియాల పొడి - 50 గ్రా
 • మిరప్పొడి - 50 గ్రా
 • ఆవాలు - పది గ్రాములు
 • నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు

విధానం:

పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి సన్నమంట మీద మగ్గనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేగిన పసుపు, ధనియాలపొడి వేయాలి. అవి వేగిన తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు, మిరప్పొడి వేసి తగినంత నీటిని పోసి సన్న మంట మీద ఉడికించాలి. ఇప్పుడు రొయ్యలు, చింతచిగురు వేసి కలిపి దాదాపుగా పది నిమిషాల సేపు ఉడికించి దించాలి.