పాలు మరిగించి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో కోడిగుడ్ల తెల్లసొనలో పంచదార, మరిగించిన పాలు కలిపి సిమ్‌లో ఉడికించాలి. ఈ మిశ్రమం చిక్కబడిన తర్వాత చల్లార్చాలి. అందులో కోకో పౌడర్ కలిపి ఫ్రీజర్‌లో పెట్టాలి. గట్టి పడిన ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసి తిరిగి ఫ్రీజర్‌లో పెట్టాలి. గట్టి పడిన ఐస్‌క్రీమ్‌ని మరోసారి గ్రైండ్ చేస్తే మెత్తగా నురగలు తేలుతున్న కోకో ఐస్‌క్రీమ్ వస్తుంది. దీన్ని ఓ గంట ఫ్రిజ్‌లో పెట్టి తినేయొచ్చు.