కొబ్బరి అరిసెలు
  • 562 Views

కొబ్బరి అరిసెలు

కావలసినవి:

  • కావలసిన పదార్థాలు:
  • మైదాపిండి - కప్పు;
  • పంచదార - రెండు కప్పులు;
  • కొబ్బరి తురుము - కప్పు;
  • యాలకుల పొడి - చెంచా;
  • నెయ్యి - అరకప్పు;
  • నూనె - తగినంత.

విధానం:

మైదాపిండిలో రెండు చెంచాల పంచదార వేసి పూరీ పిండిలా కలిపి అరగంట నాననివ్వాలి. యాలకులపొడి, మిగిలిన పంచదారను పొడిలా చేసుకుని కొబ్బరి తురుములో కలపాలి. ఇప్పుడు మైదా పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసి పూరీల్లా వత్తి పెట్టుకోవాలి. వీటిపై నెయ్యిరాసి రెండు చెంచాల కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి చుట్టూ మూసేయాలి. పైన కాస్త నెయ్యి రాసి లేదా పొడి పిండి చల్లి మరోసారి గుండ్రంగా వత్తాలి. అన్నింటినీ ఇలాగే చేయాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి సిద్ధంగా ఉన్న అరిసెల్ని వేయించాలి. బంగారువర్ణంలోకి వచ్చాక కాగితంపై పరిస్తే.. అదనపు నూనె సమస్య ఉండదు. తీయ తీయని కొబ్బరి అరిసెలు తయారవుతాయి.