కోకోనట్‌ బిస్కెట్‌
  • 356 Views

కోకోనట్‌ బిస్కెట్‌

కావలసినవి:

  • పచ్చికొబ్బరి కోరు - 1 కప్పు,
  • పంచదార - 3 కప్పులు,
  • నెయ్యి/డాల్డా - 1 కప్పు
  • మైదా - పావుకేజీ,
  • బొంబాయి రవ్వ - 1 కప్పు,
  • కోవా- అర కప్పు
  • బేకింగ్‌ పౌడర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు,
  • యాలకుల పొడి - 1 టీ స్పూన్‌

విధానం:

మైదాపిండిలో రవ్వ, కొబ్బరికోరు, కోవా, యాలకుల పొడి, నెయ్యి, బేకింగ్‌ పౌడర్‌ కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకుని చపాతీ ముద్దలా చెయ్యాలి. దీన్ని అరగంట నాననివ్వాలి. పంచదార పాకం పట్టి ఉంచాలి. చపాతీ పిండిని పెద్ద నిమ్మకాయ సైజు ఉండలు చేసుకుని కొంచెం మందంగా చపాతీలా వత్తుకోవాలి. దీన్ని కావలసిన ఆకారంలో కోసుకుని పెనంమీద నేతితో దోరగా వేయించాలి. వాటిని వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసి రెండు నిమిషాల తర్వాత తియ్యాలి. అంతే నోరూరించే కోకోనట్‌ బిస్కెట్లు రెడీ. ఇవి వారం రోజులు నిల్వ ఉంటాయి.