కొబ్బరి హల్వా
  • 340 Views

కొబ్బరి హల్వా

కావలసినవి:

  • పచ్చికొబ్బరి తురుము : రెండు కప్పులు
  • శనగపిండి : ఒకటిన్నర కప్పు
  • పాలు : అర కప్పు
  • పంచదార : రెండు కప్పులు
  • నెయ్యి : అరకప్పు
  • జీడిపప్పు : 50 గ్రాములు
  • కిస్ మిస్ : 30 గ్రాములు
  • యాలకుల పొడి : చిటికెడు

విధానం:

ముందుగా శనగపిండిని జల్లించుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి సిమ్ లో పెట్టుకొని బాణలి పెట్టి శనగపిండిని బాణలీలో వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత దీనిలోనే పంచదార, పాలు, పచ్చికొబ్బరి తురుము, నెయ్యి వేసి మొత్తం కలిసేలా కలపాలి. ఈ మిశ్రమం అడుగంటకుండా జాగ్రత్తగా కలబెట్టుకుంటూ బాగా దగ్గరగా అయ్యేవరకూ తిప్పుతుండాలి. చిక్కబడిన కొబ్బరి హల్వాలో వేయించుకున్న కొన్ని జీడిపప్పు, కిస్ మిస్, యాలకుల పొడి వేసి కలబెట్టుకోవాలి. ఒక ప్లేట్ కి నెయ్యి రాసి ఈ ప్లేట్లో కొబ్బరి హల్వాని వంచుకొని మొత్తం సమానంగా అయ్యేలా చూసుకోవాలి. తర్వాత మిగిలిన జీడిపప్పు, కిస్ మిస్ లను అలంకరించుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత చాకుతో నచ్చిన ఆకారంలోముక్కలు కట్ చేసుకోవాలి.