కోకోనట్ కుకీస్
  • 494 Views

కోకోనట్ కుకీస్

కావలసినవి:

  • మైదా - ఒకటిన్నరకప్పు
  • వెన్న - అర కప్పు
  • పంచదార - కప్పు
  • కోడిగుడ్డు - 1
  • కొబ్బరిపొడి - కప్పు
  • వంటసోడా - అర టీ స్పూను
  • ఏలకుల పొడి - టీ స్పూను
  • ఉప్పు - చిటికెడు

విధానం:

మైదాలో వంటసోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి జల్లించుకోవాలి. ఒక గిన్నెలో వెన్న, పంచదార వేసి బాగా గిలకొట్టాలి. పంచదార కరిగాక గుడ్డు వేసి మళ్లీ గిలకొట్టాలి. తరవాత మైదా, కొబ్బరిపొడి, ఏలకులపొడి వేసి కలిపి చిన్నచిన్న ఉండలుగా చేసి కాస్త వెడల్పుగా ఒత్తుకోవాలి. వీటిని వెన్న రాసిన టిన్నులో పెట్టి ముందుగా వేడి చేసుకున్న ఓవెన్‌లో 220 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర 20 నిముషాల పాటు (లేత గోధుమరంగు వచ్చే వరకు) బేక్ చేయాలి.