కొబ్బరి ఫిష్ ఫ్రై
 • 416 Views

కొబ్బరి ఫిష్ ఫ్రై

కావలసినవి:

 • చేపముక్కలు - అరకేజీ,
 • పసుపు - కొంచెం,
 • మైదా - మూడు చెంచాలు,
 • ఉప్పు - రుచికి తగినంత,
 • ఎండుమిర్చి - మూడు,
 • కొబ్బరి తురుము - మూడు చెంచాలు,
 • అల్లం - చిన్నముక్క,
 • వెల్లుల్లి - నాలుగు రెబ్బలు,
 • వైట్ వెనీగర్ - చెంచాన్నర,
 • లవంగాలు - ఆరు,
 • నూనె - వేయించడానికి సరిపడినంత,
 • నిమ్మచెక్కలు - రెండు.

విధానం:

చేప ముక్కలకు పసుపు పట్టించి పదినిమిషాల తర్వాత శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత ముక్కలకు మైదా పిండి, ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోవాలి. మరోవైపు ఎండుమిర్చి, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి, వెనిగర్ అన్నీ కలిపి మిక్సీ పట్టాలి, అందులో కాస్త నీళ్లు చేర్చుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక మైదా, ఉప్పు కలిపిన చేప ముక్కలను మసాలా ముద్దతో పట్టించి వేయించాలి. బంగారు వర్ణంలోకి వచ్చాక దించేస్తే నోరూరించే కొబ్బరి చేపల వేపుడు రెడి అయినట్లే.