కొబ్బరి మామిడి పచ్చడి
 • 533 Views

కొబ్బరి మామిడి పచ్చడి

కావలసినవి:

 • పచ్చికొబ్బరి కోరు - 1 కప్పు,
 • పునాస మామిడి (ఇప్పుడు మార్కెట్లో దొరుకుతాయి) తురుము - ముప్పావు కప్పు,
 • ధనియాలు - 1 టేబుల్ స్పూను,
 • జీలకర్ర - 2 టేబుల్ స్పూన్లు,
 • ఎండుమిర్చి - 7,
 • వెల్లుల్లి రేకలు -8,
 • ఉప్పు - రుచికి తగినంత,
 • ఇంగువ - చిటికెడు,
 • నూనె - ఒకటిన్నర టేబుల్ స్పూను,
 • ఆవాలు + మినప్పప్పు - 1 టీ స్పూను,
 • కరివేపాకు - 4 రెబ్బలు.

విధానం:

కడాయిలో 1 టేబుల్ స్పూను నూనె వేసి ఎండుమిర్చి (5), జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రేకలు, ఇంగువ ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగించి తీసేయాలి. మిగిలిన నూనెలో మామిడి కోరు, కొబ్బరి కోరు వేసి వేగనివ్వాలి. అన్నీ చల్లారాక ఎండుమిర్చి మిశ్రమాన్ని ముందుగా గ్రైండు చేసుకొని, అందులోనే మామిడి, కొబ్బరికోరు, ఉప్పు జతచేసి మరోసారి తిప్పుకోవాలి. తర్వాత మిగిలిన నూనెలో ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టి కొబ్బరిమిశ్రమంలో కలపాలి.