కోకోనట్‌ మిల్క్‌షేక్‌
  • 545 Views

కోకోనట్‌ మిల్క్‌షేక్‌

కావలసినవి:

  • కొబ్బరిపాలు - 2 కప్పులు
  • పాలు - 2 కప్పులు
  • క్రీమ్‌ - 2 స్పూన్లు
  • పంచదార - రుచికి తగినంత
  • రోజ్‌ ఎస్సెన్స్‌ - 1 స్పూన్‌
  • నల్లద్రాక్ష పండ్లు - కొద్దిగా

విధానం:

కొబ్బరికాయను పగలకొట్టి కొబ్బరిపాలు తీసుకోవాలి. పాలను మీగడ కట్టకుండా మరగబెట్టి ఎర్రగా, చిక్కగా బాసుంది క్రీములాగా తయారు చేయాలి. ఈ క్రీములో పంచదార, కొబ్బరిపాలు పోసి మజ్జిగ కవ్వంతో బాగా నురగ వచ్చేట్టుగా చిలకాలి. నురగ వచ్చిన తర్వాత రోజ్‌ ఎస్సెన్స్‌ వేసి కొద్ది సేపు ఫ్రిజ్‌లో వుంచాలి. సర్వ్‌ చేసేటప్పుడు పైన నల్లద్రాక్ష వేసుకుంటే బావుంటుంది.