మొదట బొప్పాయి కాయ చెక్కు తీసి తురుముకోవాలి. తరువాత ఈ తురిమిన కోరుని ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తరువాత నీళ్లు తీసేసి తురుమును ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇంకో గిన్నెలో బెల్లం, పంచదార కొన్ని నీళ్లు వేసి సన్నని సెగపై పాకం పట్టాలి. పాకం వచ్చిన తరువాత ఉడికించిన బొప్పాయి తురుముతో పాటు కొబ్బరి తురుమును కూడా ఈ పాకంలో వేయాలి. పాకం కాస్త చిక్కగా అయిన తరువాత దానిలో నెయ్యి వేసి స్టవ్మీదనుంచి దించేయాలి. తరువాత దీనిని లడ్డూల్లా ఉండలు చుట్టుకొని జీడిపప్పు, కిస్మిస్ వేసి గార్నిష్ చేసుకోవాలి.