కొబ్బరి షీరా
  • 309 Views

కొబ్బరి షీరా

కావలసినవి:

  • బొంబాయి రవ్వ: 1 కప్పు
  • కొబ్బరి తురుము: 2 టేబుల్‌ స్పూన్లు
  • లేత కొబ్బరి: 1/2 కప్పు
  • నెయ్యి: 3 టేబుల్‌ స్పూన్లు
  • పాలు: 2 కప్పులు
  • కోవా: 1/4 కప్పు
  • చక్కెర: తగినంత

విధానం:

రెండు టేబుల్‌ స్పూన్ల నెయ్యి బాణలిలో వేసి కరిగి వేడి అయిన తరువాత రవ్వను వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. అందులో కొబ్బరి తురుమును వేసి కాసేపు వేగనివ్వాలి. తర్వాత పాలు పోసి కలపాలి. పాలు అందులో బాగా కలిసిన తర్వాత కోవా వేసి బాగా కలపాలి. ఈ పదార్ధాలన్నీ కలిపిన తర్వాత చక్కెర వేసి బాగా కలియబెట్టాలి. ఆ పదార్ధమంతా హల్వా మాదిరిగా ఉడికేదాకా ఉడకబెట్టాలి. తర్వాత దానిపై మిగిలిన నెయ్యి పోయాలి. వీటిని కావాలనుకుంటే ఏదైనా అచ్చుల్లో పోసి తర్వాత సర్వ్‌ చేయవచ్చు. లేత కొబ్బరిని పలచని రేకుల్లా కత్తిరించి దీనిపై అలంకరించి సర్వ్‌ చేస్తే తినేందుకే కాదు చూసేందుకు కూడా బాగుంటాయి.