చేమగడ్డ పులుసు
 • 362 Views

చేమగడ్డ పులుసు

కావలసినవి:

 • చేమగడ్డలు-పావుకేజీ,
 • నూనె-తగినంత,
 • కారం-తగినంత,
 • చింతపండురసం-కప్పు,
 • నువ్వుపొడి-4 టీ స్పూన్లు,
 • జీలకర్ర, మెంతిపొడి-అర టీ స్పూను,
 • పసుపు-చిటికెడు,
 • అల్లంవెల్లుల్లి ముద్ద-టీ స్పూను,
 • ఉల్లిగడ్డ-1,
 • కరివేపాకు-2 రెమ్మలు,
 • కొత్తిమీర-చిన్న కట్ట
 • జీడిపప్పు పొడి-నాలుగు టీస్పూన్లు

విధానం:

ముందుగా చేమగడ్డల పొట్టు తీసి ముక్కలు చేసుకోవాలి. ప్రెజర్ పాన్‌లో నూనె వేడయ్యాక ఉల్లితరుగు వేసి వేగిన తరవాత అల్లంవెల్లుల్లి ముద్ద, కరివేపాకు, పసుపు, చేమగడ్డముక్కలు వేసి వేయించాలి. బాగా వేగిన తరవాత ఉప్పు, కారం, జీలకర్ర మెంతుల పొడి, నువ్వుపొడి, జీడిపపప్పు పొడి వేసి మగ్గనివ్వాలి. తరవాత చింతపండు పులుసు, రెండు గ్లాసుల నీరు పోసి పాన్ మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి. తరవాత పాన్ మూత తీసి మరోమారు మగ్గనిచ్చి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.