నవరతన్‌ కూర్మా
  • 323 Views

నవరతన్‌ కూర్మా

కావలసినవి:

  • ఉడకబెట్టిన కూరగాయ ముక్కలు - 3 కప్పులు
  • (ఆలూ, కారెట్‌, పచ్చి బఠాణీ, బీన్స్‌, కాలిఫ్లవర్‌,
  • కాప్సికమ్‌, కాబేజ్‌, గోరు చిక్కుడు, సొరకాయ)
  • పనీర్‌ - 150 గ్రా. (తురిమినది)
  • టమాటాలు - 3
  • ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగి)
  • అల్లం పేస్ట్‌ - 1 1/2 టీ స్పూన్లు
  • వెల్లుల్లి పేస్ట్‌ - 1 1/2 టీ స్పూన్లు
  • ఉప్పు - తగినంత
  • పసుపు - 1 టీ స్పూను
  • కారం - 1 1/2 టీ స్పూన్లు
  • ధనియాలపొడి - 1 టీ స్పూను
  • గరం మసాలా పొడి - 2 టీ స్పూన్లు
  • మీగడ - 2 టేబుల్‌ స్పూన్లు
  • నూనె - 6 టేబుల్‌ స్పూన్లు
  • నెయ్యి - 1 టేబుల్‌ స్పూన్‌
  • పాలు/ నీళ్ళు - 1 కప్పు
  • డ్రై ఫ్రూట్స్‌ - 1/4 కప్పు
  • కొత్తిమీర - అలంకరణకి

విధానం:

టమాటాలను మృదువుగా అయ్యేవరకూ ఉడకించాలి. తర్వాత చల్లారనిచ్చి దాని తొక్కు తీసేసి దానితో గుజు తయారు చేసుకోవాలి. లేదా రెడీమేడ్‌గా దొరికే టమాటా ప్యూరీని కూడా వినియోగించవచ్చు. తర్వాత ఒక స్పూన్‌ నేతిని బాణలిలో వేసి డ్రైఫ్రూట్స్‌ను ఒక నిమిషం పాటు మీడియం మంట మీద వేయించాలి. వాటిని తీసేసి నూనె వేసి వేడి చేసి ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయిం చాలి. ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి రెండు మూడు నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వా త అందులో టమాటా ప్యూరీని, డ్రై ఫ్రూట్స్‌ని వేయాలి. గరిటతో తిప్పుతూ దానిని నాలుగు నిమిషాల పాటు ఉడకించాలి. బాణలికి అంటుకోకుండా జాగ్రత్త పడాలి. ఇందులో పాలు, కాసిని నీళ్ళు పోస్తూ పొంగురానివ్వాలి. తర్వాత మంట తగ్గించి గ్రేవీ చిక్కగా అయ్యే వరకూ ఉంచాలి. తర్వాత అందులో పనీర్‌ వేసి గరిటతో తిప్పాలి. చివరగా ఉడకబెట్టుకున్న కూరగాయల ముక్కలను గ్రేవీలో వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించాలి. సర్వ్‌ చేసే మందు దానిపై మీగడ, కొత్తమీర ఆకులతో అలంకరించి సర్వ్‌ చేయాలి. ఇది చపాతీలలోకి, నాన్‌లలోకి అధరవుగా బాగుంటుంది. వంటకాలు