ధనియాల పచ్చడి
 • 369 Views

ధనియాల పచ్చడి

కావలసినవి:

 • ధనియాలు - 2 కప్పులు,
 •  టమాటాలు - 4,
 • పచ్చిమిర్చి - 8,
 • నూనె - 4 స్పూన్లు,
 • చింతపండు - కొద్దిగా,
 • ఉల్లిపాయలు - 2,
 • ఉప్పు - తగినంత
 • పసుపు - చిటికెడు,
 • అల్లం - చిన్న
 • ముక్క

విధానం:

ధనియాల్లో కొద్దిగా నూనె వేసి వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టి, అదే బాండీలో టమాటా ముక్కలు వేసి మగ్గబెట్టాలి. వేయించిన ధనియాలు మెత్తగా దంచాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, చింతపండు వేసి మెత్తగా నూరాలి. తర్వాత మగ్గిన టమాటా ముక్కలు వేసి రుబ్బుకోవాలి. దీన్ని పోపు పెట్టుకుంటే బాగుంటుంది.