కొత్తిమీర పొడి
  • 635 Views

కొత్తిమీర పొడి

కావలసినవి:

  • కొత్తిమీర తరుగు - రెండు కప్పులు,
  • ఎండుమిర్చి - 6,
  • మినప్పప్పు - 1 టేబుల్ స్పూను,
  • మెంతులు + ఆవాలు - 1 టీ స్పూను,
  • జీలకర్ర - 1 టీ స్పూను,
  • చింతపండు - నిమ్మకాయంత,
  • ఉప్పు - రుచికి తగినంత,
  • నూనె - 2 టీ స్పూన్లు.

విధానం:

కొత్తిమీర నీళ్లలో కడిగి, బాగా దులిపి ఒక పొడి గుడ్డమీద రెండు రోజుల పాటు ఆరనివ్వాలి. తర్వాత తోటకూరలా సన్నగా తరగాలి. కడాయిలో నూనెవేసి ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, ఆవాలు దోరగా వేగించి వేరే పళ్లెంలోకి తీయాలి. మిగిలిన నూనెలో కొత్తిమీరను వేగించాలి. అన్నీ చల్లారనిచ్చి మిక్సీలో ముందుగా పోపుసామాను, చింతపండు, ఉప్పు వేసి నలిగాక కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడి 20 రోజుల పాటు నిలవ ఉంటుంది. వేడి అన్నంతో (కాస్త నెయ్యి వేసుకు) తింటే చాలా రుచిగా ఉంటుంది.