కార్న్ బోండా
  • 384 Views

కార్న్ బోండా

కావలసినవి:

  • కార్న్ (మొక్కజొన్న గింజలు) - అరకప్పు
  • బంగాళదుంపలు - 2,
  • శనగపిండి - కప్పు
  • బియ్యప్పిండి - పావు కప్పు,
  • ఉల్లిపాయ - 1
  • పచ్చిమిర్చి - 2,
  • కారం, ఉప్పు - తగినంత
  • నూనె - తగినంత,
  • కొత్తిమీర - ఒక కట్ట

విధానం:

బాణలిలో కొంచెం నూనె వేడిచేసి పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. బంగాళదుంపలను మెత్తగా ఉడికించి పక్కన ఉంచుకోవాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి అందులో మొక్కజొన్న గింజలు వేసి కొద్దిగా వేగిన తరవాత ఉప్పు, పసుపు, కొత్తిమీర వేసి మరో రెండు నిముషాలు వేయించి, దింపి చల్లారనివ్వాలి. విడివిడిగా తయారుచేసి పెట్టుకున్న పై పదార్థాలనన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలిసేలా కలపాలి. మెత్తగా అయిన ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం, కొంచెం నీళ్లు పోసి బజ్జీలపిండిలా జారుగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న ఉండలను ఈ పిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి.