శనగపిండిలో ఉప్పు వేసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి, ఉడకబెట్టిన మొక్కజొన్న గింజలు మిక్సీ వేసుకోవాలి. ఈ మిశ్రమంలో ఆలుగడ్డ ముద్ద, సన్నగా తరిగిన కొత్తిమీర, జీలకర్ర వేసి కలుపుకోవాలి. దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. వీటిని ముందుగా కలిపిపెట్టుకున్న శనగపిండిలో ముంచి కాగిన నూనెలో వేయించుకోవాలి. అంతే మొక్కజొన్న బోండాలు రెడీ