క్యారట్ కీరదోస సలాడ్
  • 448 Views

క్యారట్ కీరదోస సలాడ్

కావలసినవి:

  • 1 టీ స్పూన్ నిమ్మరసం,
  • అర కప్పు పెసర పప్పు,
  • ఒక కీరదోసకాయ,
  • 1 కప్పు శనగ పప్పు,
  • ఒక కప్పు ఉడికించిన మొక్క జొన్న,
  • ఒక మామిడి కాయ,
  • 2 పచ్చి మిరపకాయలు,
  • చిటికెడు ఉప్పు.

విధానం:

ముందుగా శనగ పప్పు , పెసర పప్పును అర గంట పాటు నానబెట్టాలి. ఇపుడు ఒక పాత్రలో తరిగిన, క్యారట్, కీరదోసకాయ, ఉడికించిన మొక్కజోన్నలను వేసుకోవాలి. ఇపుడు సగం తరిగిన మామిడికాయను వేసుకోవాలి. తరువాత ఒక బ్లెండర్ లో నానబెట్టిన పప్పులు, తరిగిన మామిడికాయ, పచ్చి మిర్చి వేసుకొని పేస్టు లా చేసుకోవాలి. ఈ పేస్టును క్యారట్, కీరదోస మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీనిపైన ఉప్పు, నిమ్మరసం చల్లితే.. అంతే రుచికరమైన క్యారట్ కీరదోస సలాడ్ రెడీ.