మొక్కజొన్న చిప్స్
  • 447 Views

మొక్కజొన్న చిప్స్

కావలసినవి:

  • మొక్కజొన్నపిండి - ఒకటిన్నర కప్పు,
  • మైదాపిండి - 1 కప్పు,
  • నూనె (పిండిలో కలపడానికి) - 1 టేబుల్ స్పూను,
  • ఉప్పు - రుచికి సరిపడా,
  • కొత్తిమీర తరుగు - 1 కప్పు,
  • ఎండుమిర్చి (సన్నముక్కలు) - 1 టీ స్పూను,
  • నూనె - (చిప్స్ వేగించడానికి) సరిపడా

విధానం:

ఒక వెడల్పాటి పాత్రలో మొక్కజొన్నపిండి, మైదా పిండి, ఉప్పు, మిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, టేబుల్ స్పూను నూనె వేసి గోరువెచ్చని నీటితో గట్టిగా ముద్దలా కలుపుకోవాలి. ఈ ముద్దని గంట పాటు నానబెట్టి, చపాతీల్లా వత్తుకుని చాకుతో మీకు ఇష్టమైన ఆకారాల్లో (చిప్స్‌గా) కట్ చేసుకోవాలి. తర్వాత నూనెలో దోరగా (కరకరలాడేలా) వేగించుకోవాలి. ఈ చిప్స్‌ని పిల్లలతో పాటు పెద్దలూ ఇష్టంగా తింటారు.