మొక్కజొన్న దోశ
  • 457 Views

మొక్కజొన్న దోశ

కావలసినవి:

  • మొక్కజొన్న గింజలు - రెండు కప్పులు
  • బియ్యం - కప్పు
  • అల్లం - చిన్నముక్క,
  • పచ్చిమిర్చి - 3,
  • ఉప్పు - తగినంత,
  • నూనె - తగినంత

విధానం:

బియ్యం కడిగి, నాలుగు గంటలు నాననివ్వాలి. నానిన బియ్యాన్ని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. మొక్కజొన్న గింజలు, పచ్చిమిర్చి, అల్లం కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రుబ్బిన బియ్యం, మొక్కజొన్న మిశ్రమాలను కలిపి ఉప్పు వేసి, జారుగా దోశల పిండిలా కలుపుకోవాలి. కాలిన పెనం మీద దోశ వేసి రెండు వైపులా కాల్చి చట్నీతో సర్వ్ చేయాలి