మొక్కజొన్న కబాబ్‌
  • 274 Views

మొక్కజొన్న కబాబ్‌

కావలసినవి:

  • లేత మొక్కజొన్నగింజలు... 2 కప్పులు
  • పచ్చిమిర్చి... 6
  • ఉల్లిపాయ... ఒకటి
  • అల్లం... చిన్నముక్క
  • వడకట్టిన పెరుగు... అరకప్పు
  • గరంమసాలా... పావు టీ.
  • చాట్‌మసాలా... పావు టీ.
  • కొత్తిమీర... 2 కట్టలు
  • క్యాప్సికమ్... ఒకటి
  • నిమ్మరసం... నాలుగు టీ.
  • ఉప్పు... తగినంత

విధానం:

లేత మొక్కజొన్న గింజల్ని ఒలిచి మిక్సీలో కాస్త కచ్చాపచ్చాగా రుబ్బాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యాప్సికమ్‌, అల్లం... అన్నీ చాలా సన్నగా తరగాలి. ఓ పాత్రలో రుబ్బిన మొక్కజొన్న ముద్ద వేయాలి. అందులోనే ఉప్పు, గరంమసాలా, చాట్‌మసాలా, అల్లంముక్కలు వేసి కలపాలి. తరువాత ఉల్లిపాయలు, క్యాప్సికమ్‌, కొత్తిమీర, పచ్చిమిర్చి, వడకట్టిన పెరుగు వేసి కాస్త గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు వేలు మందంలో ఉండే ఇనుపచువ్వను తీసుకుని ఈ కబాబ్‌ మిశ్రమాన్ని దాని చుట్టూతా అంటించి నిప్పులు లేదా గ్యాస్‌స్టవ్‌మీద ఎర్రగా కాల్చాలి. వీటిని వేడివేడిగా చట్నీతో వడ్డిస్తే భలే రుచిగా ఉంటాయి.