బేబీకార్న్ను చిన్న ముక్కలు చేసి... ఉప్పు నీళ్లలో ఉడికించాలి. ఒక పాత్రలో మొక్కజొన్న పిండి, బియ్యం పిండి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు వేసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఇందులో ఉడికించిన బేబీకార్న్ను ముంచి బజ్జీల్లా వేయించాలి. బాండీలో కొద్దిగ నూనె వేసి అందులో వెల్లుల్లి, ఉల్లిముక్కలు, ఉల్లికాడ ముక్కలు ఎర్రగా వేయించాలి. ఇందులో బేబీకార్న్ బజ్జీలని వేయాలి. వాటిపైన సోయా సాస్, చిల్లీసాస్, టమాటా సాస్, కొద్దిగా ఉప్పు చల్లితే చాలు. వేడివేడి బేబీకార్న్ మంచూరియా రెడీ.