కార్న్‌ హల్వా
  • 270 Views

కార్న్‌ హల్వా

కావలసినవి:

  • కార్న్‌ఫ్లోర్‌ - 100 గ్రాములు
  • పంచదార - 300 గ్రాములు
  • నెయ్యి - 5 టేబుల్‌ స్పూన్లు
  • పాలు - 3 టేబుల్‌ స్పూన్లు
  • జీడిపప్పు - 10
  • బాదం పప్పు - 8
  • పిస్తాపప్పు - 20
  • యాలకుల పొడి - 1 టీ స్పూన్‌
  • ఫుడ్‌ కలర్‌ - కొద్దిగా

విధానం:

కార్న్‌ఫ్లోర్‌లో నెయ్యి, పాలు బాగా కలపాలి. నేతిలో జీడిపప్పు వేయించాలి. పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి తీగపాకం పట్టాలి. అందులో కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమం, ఫుడ్‌ కలర్‌ కలిపి నూనె చిందేవరకు (బాండీకి మిశ్రమం అంటకుండా ఉండాలి) బాగా ఉడికించాలి. తర్వాత వేయించిన జీడిపప్పు, సన్నగా తరిగిన బాదం, పిస్తాపప్పు కలిపి నెయ్యి రాసిన పళ్లెంలో వేసి ఆరాక ముక్కలు కోసుకోవాలి. పైన బాదం పప్పులు అలంకరింస్తే సరి, నోరూరించే కార్న్‌ హల్వా తయార్‌.