క్రిస్పీ బనానా
 • 303 Views

క్రిస్పీ బనానా

కావలసినవి:

 • అరటికాయ - ఒకటి
 • శనగపిండి - టీ స్పూను
 • మైదా - టీ స్పూను
 • కార్న్‌ఫ్లోర్ - టీ స్పూను
 • ఉప్పు - తగినంత
 • అల్లంవెల్లుల్లి ముద్ద - అర టీ స్పూను
 • ఉల్లితరుగు - అర కప్పు
 • కరివేపాకు - రెండు రెమ్మలు
 • జీలకర్ర - టీ స్పూను,
 • కారం - టీ స్పూను,
 • ఎండుమిర్చి - 4,
 • జీడిపప్పుపొడి - టీ స్పూను,
 • పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు,
 • నూనె - డీప్ ఫ్రైకి సరిపడా,
 • మిరియాలపొడి - అర టీ స్పూను,
 • ధనియాలపొడి - అర టీ స్పూను,
 • కొత్తిమీర - ఒక కట్ట

విధానం:

ముందుగా అరటికాయ చెక్కు తీసి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాణలిలో నూనె పోసి వేడయ్యాక అరటికాయ ముక్కలను నూనెలో వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఎండుమిర్చి, ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. వేగాక అందులో అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, జీలకర్ర వేసి మరోమారు వేయించాలి. తరవాత జీడిపప్పుపొడి, ఉప్పు, కారం వేసి బాగా కలిపి అందులో వేయించుకున్న అరటికాయ ముక్కలను వేసి బాగా కలపాలి. ఒక గిన్నెలో శనగపిండి, మైదా, కార్న్‌ఫ్లోర్, కొద్దిగా నీరుపోసి జారుగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముక్కల మీద పోసి బాగా కలపాలి. ముక్కలు దగ్గర పడిన తరవాత ధనియాలపొడి, మిరియాలపొడి వేసి బాగా కలిపి దింపేసి, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.