నేతి దోసకాయ పచ్చడి
  • 209 Views

నేతి దోసకాయ పచ్చడి

కావలసినవి:

  • దోసకాయ ముక్కలు.. ఒక కప్పు
  • నూనె.. ఒక టీ.
  • శనగపప్పు.. రెండు టీ.
  • జీలకర్ర.. ఒక టీ.
  • ఆవాలు.. ఒక టీ.
  • పచ్చిమిర్చి.. ఐదు
  • టొమోటో.. ఒకటి
  • చింతపండు గుజ్జు.. 2 టీ.
  • ఉప్పు.. తగినంత
  • వెల్లుల్లి రేకలు.. నాలుగు
  • నెయ్యి.. తగినంత

విధానం:

పాత్రలో నెయ్యి వేడయ్యాక శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. టొమోటోలను జతచేసి కాసేపు ఉడికించిన తరువాత చింతపండు గుజ్జు, ఉప్పు కలపాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత మెత్తగా నూరుకోవాలి. దాంట్లో దోసకాయ ముక్కల్ని కలపాలి. మరో పాత్రలో ఒక టీస్పూన్ నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు వేయించి ఈ తాలింపును దోసకాయ చట్నీలో కలిపితే సరి... నోరూరించే దోసకాయ ముక్కల పచ్చడి తయారైనట్లే..!