దోసకాయలను స్టౌ మీద కాల్చి, చల్లారాక పొట్టు తీయాలి.బాణలిలో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేగాక, ఎండుమిర్చి వేసి మరోమారు వేయించి దించేయాలి. చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. దోసకాయగుజ్జు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.