దోసకాయ పప్పు
 • 433 Views

దోసకాయ పప్పు

కావలసినవి:

 • కందిపప్పు-1 కప్పు,
 • దోసకాయ ముక్కలు-ఒకటిన్నర కప్పు,
 • ఉల్లిపాయ-1,
 • టమోటా-1,
 • పసుపు-పావు టీ స్పూన్‌,
 • నీళ్ళు- 2 కప్పులు,
 • పచ్చి మిర్చి- 3,


పోపు కోసం

 • ఆవాలు, జీలకర్ర-1 టీ స్పూన్‌,
 • వెల్లుల్లి, ఎండు మిర్చి-2,
 • కరివేపాకు-2 రెబ్బలు,
 • నూనె-2 టీ స్పూన్లు,

విధానం:

కందిపప్పు, ఉల్లిపాయ, దోసకాయ, టమోటా ముక్కలు, పచ్చి మిర్చి, పసుపు, 2 కప్పుల నీళ్ళు కలిపి కుక్కర్‌లో పెట్టి 3 విజిల్స్‌ వచ్చేంత వరకు ఉడకబెట్టాలి. ఆ తరువాత మరొక పాత్రలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి అర నిమిషం పాటు వేయించాలి. తరువాత ఉడకబెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని వేసి కలియబెట్టి సిమ్‌ మీద అయిదు నిమిషాలుంచి దింపేయాలి.