సేమ్యా పెరుగు
  • 217 Views

సేమ్యా పెరుగు

కావలసినవి:

  • సేమ్యా... రెండు కప్పులు
  • నీళ్లు.. ఆరు కప్పులు
  • పెరుగు.. రెండు కప్పులు
  • కాచినపాలు.. అర కప్పు
  • ఉప్పు.. తగినంత
  • క్యారెట్ తురుము.. అర కప్పు
  • కీరా ముక్కలు.. అర కప్పు
  • ఎండుద్రాక్ష.. 20
  • పచ్చిమిర్చి.. 3
  • అల్లం.. చిన్న ముక్క
  • కొత్తిమీర.. ఒక కట్ట
  • కరివేపాకు... రెండు రెమ్మలు
  • ఆవాలు.. పావు టీ.
  • ఎండుమిర్చి... ఒకటి
  • నెయ్యి.. ఒక టీ.

విధానం:

ముందుగా నూనె లేకుండా సేమ్యాను వేయించాలి. తరువాత మరిగించిన నీళ్లలో సేమ్యా వేసి ఉడికించాలి. దీన్ని మరిన్ని నీళ్లతో కడిగి చల్లని నీళ్లలో వేసి కాసేపు పక్కన ఉంచాలి. పెరుగులో పాలు కలపాలి. ఆపై క్యారెట్‌ తురుము, కీరా ముక్కలు, ఉప్పు, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. బాణలిలో నెయ్యి వేసి ఎండుద్రాక్ష, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు చేసి పెరుగులో కలపాలి. విడిగా నీళ్లలో వేసి ఉంచిన సేమ్యా కూడా పెరుగులో వేసి, కొత్తిమీర చల్లి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి చల్లచల్లగా అందించాలి. ఇష్టమైతే పోపులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. అంతే సేమ్యా పెరుగు తయార్..! దీనిని చిన్నారులు ఎంతో ఇష్టంగా తింటారు.