కరివేపాకు పొడి
 • 482 Views

కరివేపాకు పొడి

కావలసినవి:

 • కరివేపాకు - కప్పు
 • ధనియాలు, శనగపప్పు -
 • రెండు టీ స్పూన్ల చొప్పున
 • ఎండుమిర్చి - 10
 • నూనె, ఉప్పు - తగినంత
 • ఇంగువ - పావు టీ స్పూను
 • మినప్పప్పు - టీ స్పూను
 • ఎండుకొబ్బరి పొడి -
 • రెండు టీ స్పూన్లు
 • పసుపు - చిటికెడు

విధానం:

ముందుగా కరివేపాకు ఆకులు తుంపి శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. బాణలిలో నూనె లేకుండా ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుకొబ్బరిపొడి వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి తీసి పక్కనుంచాలి. అదేపాత్రలో టీ స్పూను నూనె వేసి కాగాక ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి వేయించాలి. ఇవి చల్లారిన తరవాత అన్నిటినీ కలిపి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి, చివరగా ఉప్పు వేసి మరోమారు గ్రైండ్ చేయాలి. ఈ కరివేపాకు పొడి వేడి వేడి అన్నంలో కాని ఇడ్లీలతో తింటే రుచిగా ఉంటుంది.