శనగపప్పు కరివేపాకు పకోడి
  • 308 Views

శనగపప్పు కరివేపాకు పకోడి

కావలసినవి:

  • శనగపప్పు... అర కిలో
  • ఉల్లిపాయలు... నాలుగు
  • పచ్చిమిర్చి.... పది
  • కారం... రెండు టీ.
  • కొత్తిమీర... అర కప్పు
  • కరివేపాకు... అర కప్పు
  • అల్లం... చిన్న ముక్క
  • నూనె... వేయించేందుకు సరిపడా
  • ఉప్పు... తగినంత

విధానం:

రెండు గంటలముందే శెనగపప్పును నానబెట్టుకోవాలి. తరవాత నీళ్లన్నీ వంపేసి పచ్చిమిర్చి, కారం, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, ఉప్పు అన్నీ చేర్చి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమానికి సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిముక్కలు చేర్చి, బాగా కలపాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి కాగాక, పిండిని పకోడీల మాదిరిగా వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. అంతే శెనగపప్పు కరివేపాకు పకోడీలు తయారయినట్లే...!