దద్దోజనం
  • 409 Views

దద్దోజనం

కావలసినవి:

  • బియ్యం - పావుకిలో,
  • పెరుగు- 3 కప్పులు,
  • పాలు- అరలీటరు,
  • అల్లం- కొంచెం,
  • పచ్చిమిర్చి- 4,
  • నెయ్యి - ఒక టేబుల్‌ స్పూను
  • కరివేపాకు- రెండు రెబ్బలు,
  • ఉప్పు- చాలినంత,
  • జీలకర్ర- కొంచెం,
  • మినప్పప్పు- ఒక టేబుల్‌ స్పూన్‌,
  • ఆవాలు- ఒక టీ స్పూను,
  • ఎండుమిర్చి- 4

విధానం:

పాలు మరగించి చల్లార్చి వుంచుకోవాలి. బియ్యం శుభ్రంగా కడిగి అన్నం కొద్దిగా మెత్తగా వండాలి. అన్నం వుడికిన తర్వాత గరిటెతో బాగా మెదుపుకోవాలి. దీనికి పాలు (చల్లార్చినవి), పెరుగు కలపాలి. ఒక మూకుడులో నెయ్యిపోసి మినప్పప్పు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేయించి ఈ పోపు పెట్టుకోవాలి. దీన్ని పాలు, పెరుగు కలిపిన అన్నంలో వేసి తిప్పాలి.