ఫ్రూట్ దహీ
  • 394 Views

ఫ్రూట్ దహీ

కావలసినవి:

  • పుచ్చకాయ ముక్కలు - పావు కప్పు
  • అర టిపండు ముక్కలు - పావు కప్పు
  • ద్రాక్ష పండ్లు - పది
  • దానిమ్మ గింజలు - పావు కప్పు
  • పంచదార పొడి - మూడు టీ స్పూన్లు
  • పెరుగు - రెండు కప్పులు

విధానం:

ఒక గిన్నెలో పెరుగు వేసి వెన్న తేలేలా చిలకాలి. పంచదార వేసి బాగా కలపాలి.తరిగి ఉంచుకున్న పండ్ల ముక్కలను వేసి కలుపుకోవాలి. (ఏ పండ్లు అందుబాటులో ఉంటే వాటితో తయారుచేసుకోవచ్చు. ఇష్టపడేవారు ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు)