దహీ వడ
 • 511 Views

దహీ వడ

కావలసినవి:

 • మినప్పప్పు - రెండు కప్పులు,
 •  ఉప్పు - రుచికి తగినంత,
 • నూనె - వేయించడానికి సరిపడా,


దహీకి కావలసినవి

 • పెరుగు - లీటరు,
 • వేయించిన జీరాపొడి - టీ స్పూను,
 •  మిరప్పొడి - టీ స్పూను,
 • ఉప్పు - రుచికి తగినంత,
 • పంచదార - రెండు టేబుల్‌స్పూన్లు,
 •  అల్లం తురుము - టీ స్పూను,
 • కొత్తిమీర - చిన్న కట్ట

విధానం:

ముందురోజు రాత్రి మినప్పప్పును నానబెట్టాలి. మరుసటి రోజు గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బి, ఉప్పు కలిపి పక్కన ఉంచుకోవాలి. బాణలిలో నూనె కాగాక ఈ పిండిని చిన్నచిన్న గారెల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి వేయించి తీసి నీళ్లలో వేసి ఒక నిముషం నాననిచ్చి తీసేయాలి. ఒక పాత్రలో పెరుగు వేసి చిక్కగా చిలకరించి, అందులో ఉప్పు, పంచదార, జీరాపొడి, మిరప్పొడి వేసి కలిపి, వేయించి ఉంచుకున్న గారెలను ఇందులో వేయాలి. కొత్తిమీర తరుగు, అల్లం తురుములను పైన చల్లాలి. చివరగా చింతపండు చట్నీ, పుదీనా చట్నీలతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేయాలి.