దాల్ మహారాణి
  • 444 Views

దాల్ మహారాణి

కావలసినవి:

  • రాజ్మా - 4 టీ స్పూన్లు
  • మినప్పప్పు - 4 టీ స్పూన్లు;
  • శనగపప్పు - 3 టీ స్పూన్లు
  • ఉల్లితరుగు - అరకప్పు;
  • టొమాటో తరుగు - అరకప్పు
  • పచ్చిమిర్చి తరుగు - 2 టీ స్పూన్లు;
  • వెన్న - 50గ్రా
  • అల్లం తరుగు - టీ స్పూను;
  • క్రీమ్ - 30 మి.లీ.
  • ఉప్పు - తగినంత,
  • పసుపు - చిటికెడు
  • మిరప్పొడి - టీ స్పూను,
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • జీలకర్ర - టీ స్పూను;
  • ఆవాలు - టీ స్పూను

విధానం:

ముందురోజు రాత్రి రాజ్మా, మినప్పప్పు, శనగపప్పు ఈ మూడింటినీ కలిపి నానబెట్టాలి. మరుసటిరోజు ఉదయం వాటిని శుభ్రంగా కడిగిన తరవాత, తగినంత నీరు పోసి కుకర్‌లో పెట్టి ఉడికించి దింపేయాలి.
చల్లారిన తరవాత మెత్తగా మెదుపుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి కొద్దిగా వెన్న వేసి కరిగిన తరవాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడేవరకు వేయించాలి. తరవాత అల్లం, పచ్చిమిర్చి తరుగులు వేసి రెండు నిమిషాలు వేయించాక, ఉల్లి, టొమాటో తరుగులు వేసి బాగా కలిపి ఉడికించాలి. తరవాత ఉప్పు, పసుపు, మిరప్పొడి వేసి కలపాలి. తరవాత ఉడికించుకుని మెత్తగా చేసుకున్న పప్పు మిశ్రమాన్ని ఇందులో వేసి మరో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. చివరగా క్రీమ్, కరివేపాకు వేసి కలిపి దించేయాలి. దాల్ మహారాణి రోటీలలోకి బావుంటుంది.