దాల్ మఖానీ
 • 469 Views

దాల్ మఖానీ

కావలసినవి:

 • మినుములు - 200 గ్రా,
 • రాజ్మా గింజలు - 50 గ్రా
 • టొమాటోలు - 5 (పేస్ట్ చేయాలి),
 • ఉల్లిపాయలు - 3
 • తరిగిన అల్లం - 30 గ్రా,
 • దాల్చినచెక్క - రెండు ముక్కలు
 • ఏలకులు - 5 గ్రా,
 • జీరా పౌడర్ - 10గ్రా,
 • తరిగిన వెల్లుల్లి - 30 గ్రా
 • పచ్చిమిర్చి - రెండు,
 • మిరప్పొడి - 25 గ్రా,
 • ఎండుమిర్చి - 10గ్రా
 • జీలకర్ర - 10గ్రా,
 • ఫ్రెష్ క్రీమ్ - 30 మి.లీ.
 • కొత్తిమీర - కట్ట,
 • వెల్లుల్లి పేస్టు - 30 గ్రా,
 • బిర్యానీ ఆకులు - 3,
 • నెయ్యి - 50గ్రా,
 • లవంగాలు - 4

విధానం:

మినుములు, రాజ్మా గింజలను కడిగి ఆరుగంటల సేపు నానబెట్టాలి. నానిన పప్పులలో లవంగాలు, బిర్యానీ ఆకు, ఏలకులు, దాల్చిన చెక్క, అల్లం ముక్కలు కొన్ని, కొద్దిగా నెయ్యి వేసి ఉడికించాలి. పప్పులు ఉడికిన తర్వాత ఉప్పు కలపాలి. బాగా ఉడికిన తర్వాత దించి పక్కన ఉంచుకోవాలి. బాణలిలో మిగిలిన నెయ్యి వేసి వేడి అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత టొమాటో పేస్ట్, కొద్దిగా అల్లంవెల్లుల్లి పేస్ట్ , ఉప్పు వేసి ఉడికించాలి. మిశ్రమం బాగా ఉడికిన తర్వాత మిరప్పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. ఇందులో ముందుగా ఉడికించి పక్కన ఉంచిన రాజ్మా, మినుముల మిశ్రమాన్ని వేసి బాగా కలిపి కొంతసేపు సన్నమంట మీద ఉడికించాలి. దీనిని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని వెన్న, కొత్తిమీరలతో గార్నిష్ చేయాలి.